తాండూరు: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే ప్రారంభోత్సవాలు చేపట్టాలన్నారు. నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులతో అధికారులు త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. 99 రోజుల ప్రణాళిక పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యటించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో హౌజింగ్ అధికారులు, మండల పరిషత్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి


