హ్యపీ బర్త్‌డే బ్రదర్‌ | - | Sakshi
Sakshi News home page

హ్యపీ బర్త్‌డే బ్రదర్‌

Mar 11 2026 8:41 AM | Updated on Mar 11 2026 8:41 AM

బీఎస్‌ఆర్‌ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి బర్త్‌డే వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో జరిగిన జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే బీఎంఆర్‌, సోదరుడు సత్యనారాయణరెడ్డి తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డితో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంతో పాటు పరిగి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు అభిమానులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

కుల్కచర్ల: ఆర్‌బీఎల్‌ కంపెనీ సీఎండీ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో కేక్‌ కట్‌ చేసి తినిపించుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, బస్టాండ్‌లో ప్రయాణికులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాంచంద్రయ్య, శంకర్‌, గోపాల్‌ రెడ్డి, ఆంజనేయులు, ఉమాశంకర్‌, వినోద్‌, కృష్ణ, ఎల్‌రెడ్డి, మధూకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement