జాతీయ సదస్సుకు సర్పంచ్‌ సౌభాగ్యలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

జాతీయ సదస్సుకు సర్పంచ్‌ సౌభాగ్యలక్ష్మి

Mar 12 2026 9:13 AM | Updated on Mar 12 2026 9:13 AM

కొడంగల్‌ రూరల్‌: కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న సశక్త్‌ పంచాయత్‌ – నేత్రి అభియాన్‌ జాతీయ మహిళా సదస్సుకు మండలంలోని అంగడిరాయిచూర్‌ సర్పంచ్‌ సౌభాగ్యలక్ష్మి వెళ్లారు. బుధవారం న్యూఢిల్లీ జనపథ్‌ రోడ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పంచాయతీ మహిళా ప్రతినిధులకు నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. మహిళా సర్పంచ్‌లు పాలనలో చురుగ్గా పాల్గొంటూ గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసినట్లు సౌభాగ్యలక్ష్మి తెలిపారు. రాష్ట్రం నుంచి 17 మంది సర్పంచులు, 5గురు అధికారులు హాజరయ్యాని ఎంపీడీఓ ఉషశ్రీ తెలిపారు. కొడంగల్‌ మండలం అంగడిరాయిచూర్‌ గ్రామ సర్పంచ్‌ సౌభాగ్యలక్ష్మి, నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ సర్పంచ్‌ సి.రజిత హాజరయ్యారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement