దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో విఫలం

Mar 12 2026 9:13 AM | Updated on Mar 12 2026 9:13 AM

పరిగి: దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌ ఆరోపించారు. బుధవారం పరిగి బస్టాండ్‌లో దివ్యాంగులతో కలసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే.. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆర్టీసీలో వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. వాటిని నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.4 వేల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని చెప్పి, విస్మరించారన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్మామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్‌ నాయకులు పసుల చంద్రయ్య, విద్యార్థి విభాగం నాయకుడు కడియం నరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement