తాండూరు టౌన్: డిగ్రీ ఫస్టియర్ సెమిస్టర్ ఫలితాల్లో పట్టణంలోని సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బీఎస్సీ(బీజెడ్సీ) మొదటి సంవత్సరంలో సమ్రా ఫిర్దౌస్ 9.68 జీపీఏ, నుష్రా తరన్నుమ్ 9.52 జీపీఏ, జె.అక్షిత 9.36 జీపీఏ సాధించారు. బీఎస్సీ (ఎంపీసీ)ఫస్టియర్‌లో ఎం.స్వప్న 9.48 జీపీఏ, సాయికీర్తి 9.28 జీపీఏ సాధించారు. బీకాం ఫస్టియర్‌లో అలియా ఖాతూన్ 9.28 జీపీఏ, బీబీఏలో ఆయేషా నహీన్ 9.2 జీపీఏ, బీఏలో మదిహా ఫాతిమా 9.2 జీపీఏ సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కళాశాల వ్యవస్థాపకులు, యాజమాన్య సభ్యులు వి.రంగారావు, ప్రిన్సిపాల్ విజయాదేవి, వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి, అధ్యాపకులు, సహచర విద్యార్థులు వారిని అభినందించారు.


