ఎంపీడీఓ గ్యామా, సర్పంచ్ శివకుమార్‌రెడ్డి
దోమ: కస్తుర్బాగాంధీ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎంపీడీఓ గ్యామా, సర్పంచ్ మాలి శివకుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పాఠశాలలో ఎంఈఓ వెంకట్‌తో కలసి ఆర్వో ప్లాంట్‌ను వారు ప్రారంభించారు. తొలుత పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మధ్నాహ్న భోజనం వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించాలనిఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించేందుకు ఎస్‌ఓ శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపరాదని, పాఠశాలలో ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తేవాలని సూచించారు. పాఠశాల ఎస్‌ఓ శైలజ, ఆర్‌ఐ రాంచంద్రారావు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


