పాతాళానికి ఉల్లి ధరలు | - | Sakshi
Sakshi News home page

పాతాళానికి ఉల్లి ధరలు

Mar 13 2026 9:07 AM | Updated on Mar 13 2026 9:07 AM

పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళన

పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళన

మర్పల్లి: ఉల్లి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. పెట్టుబడి డబ్బు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన మినుము, పెసర, సోయాబీన్‌ వంటి పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాల రైతులు సుమారు 600 ఎకరాల్లో యాసంగి పంటగా బావులు, బోర్ల కింద ఉల్లి సాగు చేశారు. ఎకరాకు రూ.60 నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టారు. 80 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. ఆశించిన మేర దిగుబడి వచ్చినా ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటాలు ఉల్లిపాయల బస్తా రూ.700 ఉందని తెలిపారు. నాట్లు, రవాణ, కూలీల ఖర్చులకే సరిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతుఽ ధర రూ.2 వేలు ప్రకటించాలని కోరారు. మండలంలోని పంచలింగాల ఒక్క గ్రామంలోనే 450 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేసినట్లు రైతు మొగులయ్య తెలిపారు. ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పలపాలవుతామని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement