కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

Mar 13 2026 9:07 AM | Updated on Mar 13 2026 9:07 AM

కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు కాంగ్రెస్‌ పార్టీలోకిముగ్గురు సర్పంచులు మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌: బీఎంఆర్‌ గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

అనంతగిరి: తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు గురువారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ను కోరారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌తో కలిసి నగరంలోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సర్వేయర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు శుభప్రద్‌ పటేల్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ధారూరు: కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్‌ ఆధ్వర్యంలో గురువారం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సమక్షంలో ముగ్గురు సర్పంచులు హస్తం పార్టీలో చేరారు. ధారూరు ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హరిదాస్‌పల్లి సర్పంచ్‌ శ్రీకాంత్‌గౌడ్‌, లక్ష్మినగర్‌తండా సర్పంచ్‌ కెతావత్‌ పూజ, అల్లాపూర్‌ సర్పంచ్‌ మంత్రి విజయలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌, ఏఎంసీ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు తదితరులు పాల్గొన్నారు.

తాండూరు: రంజాన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో తాండూరు ఎమ్మెల్యే మనోమర్‌రెడ్డి పాల్గొన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు ఆమేర్‌ అబ్దుల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. మత పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్‌ కరణం పురుషోత్తంరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల నర్సింహులు, డీసీసీబీ మాజా వైస్‌ చైర్మన్‌ రవిగౌడ్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, లొంక నర్సింహులు పాల్గొన్నారు.

తాండూరు: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తాండూరు ఎకై ్సజ్‌ పోలీసులు గురువారం తెలిపారు. బస్వణ్ణ కట్ట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో బుధవారం తనిఖీలు చేయగా పాత తాండూరు ప్రాంతం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన సలీం పాషా, గాంధీ చౌక్‌ ప్రాంతం దోబీగల్లికి చెందిన నవీన్‌కుమార్‌ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం, సెల్‌ ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపరాఉ. దాడుల్లో డీటీఎఫ్‌ ఎస్సై ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది హనుమంతు, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement