ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి

Mar 13 2026 9:07 AM | Updated on Mar 13 2026 9:07 AM

తాండూరు: ఉపాధ్యాయుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారమయ్యేలా చూడాలని తపస్‌ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కోరారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్సీ బకాయిలు వెంటనే మంజూరయ్యేలా చూడాలని కోరారు. పెండింగ్‌ డీఏలు వచ్చేలా చొరవ చూపాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల పక్షాన తన వాణి వినిపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీయూఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆనందం, నియోజవకర్గ కన్వీనర్‌ చంద్రశేఖర్‌, ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్‌, సంతోష్‌కుమార్‌, రవికుమార్‌, వినోద్‌కుమార్‌, అనిల్‌, వీరేశం, లక్ష్మికాంత్‌రావు, కొత్త శ్రీనివాస్‌, శంకర్‌, ప్రభాకర్‌రావు, బాలకృష్ణ, పండరప్ప, ప్రమోద్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డినికోరిన తపస్‌ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement