పనుల్లో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో వేగం పెంచండి

Mar 13 2026 9:07 AM | Updated on Mar 13 2026 9:07 AM

నాణ్యతలో రాజీ పడొద్దు

16 నెలల్లో ఎడ్యుకేషన్‌ హబ్‌ భవన నిర్మాణాలు పూర్తి కావాలి

సీఎంఓ సెక్రటరీ మాణిక్కరాజ్‌

దుద్యాల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎంఓ సెక్రటరీ మాణిక్క రాజ్‌ ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 16 నెలల్లో భవన నిర్మాణాలు పూర్తి కావాలని టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతి రెడ్డికి సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. భవనాలు అందుబాటులోకి రాగానే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, ఎడ్యుకేషన్‌ హబ్‌ డీఈఈ విజయభాస్కర్‌ రెడ్డి, డిప్యూటీ ఈఈలు రాజయ్య, నాగేశ్వర్‌ రావు, ఏఈలు జనార్దన మూర్తి, విజయభాస్కర్‌ రెడ్డి, ప్రాజెక్టు టెక్నికల్‌ ఆఫీసర్‌ సుదర్శన్‌ రెడ్డి, కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement