ఉన్నత శిఖరాలు అధిరోహించాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

Mar 13 2026 9:07 AM | Updated on Mar 13 2026 9:07 AM

అనంతగిరి: మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. గురువారం పట్టణంలోని మహవీర్‌ మెడికల్‌ కళాశాలలో జిల్లా షీ టీమ్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. మహిళలు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నప్పుడే శక్తివంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి మహిళకు చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. వారి భద్రతకు ప్రభుత్వం, పోలీస్‌ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. ఈవ్‌ టీజింగ్‌, వేదింపుల నివారణపై షీ టీమ్స్‌ నిరంతరం నిఘా ఉంచుతాయని స్పష్టం చేశారు. అనంతరం వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గడ్డం అనన్య మాట్లాడుతూ.. నేటి సమాజంలో చదువుతోనే ఏదైనా సాధించగలమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్‌, డీఈఓ రేణుకాదేవి, డీఎంహెచ్‌ఓ స్వర్ణలత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మహిళా పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సరోజ, మహవీర్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ భాస్కర్‌ రాజు, షీ టీమ్‌ సిబ్బంది, వైద్య విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ స్నేహ మెహ్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement