అనంతగిరి: నూతన ప్రజాప్రతినిధులకు నిర్దేశిత అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లకు గురువారం నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందరి భాగస్వామ్యంతో ప్రగతిప్రణాళికను విజయవంతం చేస్తామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఇతర జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దీపక్‌తివారి


