బాలికలకు వరం.. ‘హెచ్‌పీవీ’ | - | Sakshi
Sakshi News home page

బాలికలకు వరం.. ‘హెచ్‌పీవీ’

Mar 9 2026 9:28 AM | Updated on Mar 9 2026 9:28 AM

బషీరాబాద్‌: గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ నియంత్రణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో చెక్‌ పెట్టొచ్చని బషీరాబాద్‌ సివిల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఆదివారం హెపీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలపాటు ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బాలికలు తమ ఆధార్‌కార్డు తీసుకుని వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత నెల రోజులకు రెండో డోసు, ఆరు నెలల తర్వాత మూడో డోసు ఉంటుందని చెప్పారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ బాలికలకు వరమన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ అధికారి డాక్టర్‌ గోపాల్‌, ఉప సర్పంచ్‌ అబ్దుల్‌ రజాక్‌, స్టాఫ్‌ నర్స్‌ గీత, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

బషీరాబాద్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement