అనంతగిరి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా క్రీడలు, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. రంగోలి, క్యారమ్స్, చెస్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో క్రీడల విభాగం జిల్లా అధికారి సత్తార్, మహిళా సంక్షేమ శాఖ అధికారి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా ఉమాశంకరప్రసాద్ సోమవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు చేపట్టారు. తాండూరు సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ దీపక్ తివారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను బహూకరించారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో ఎన్నిక
బంట్వారం: సర్పంచుల సంఘం బంట్వారం మండల అధ్యక్షురాలిగా సుల్తాన్‌పూర్ సర్పంచ్ బర్కత్‌పల్లి విజయలక్ష్మి ఎన్నికై ంది. మండలంలోని 12 జీపీలు ఉండగా ఏడుగురు సర్పంచులు సోమవారం నగరంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని పేర్కొన్నారు. స్పీకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం, మాజీ సర్పంచ్ నర్సింలు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవాబుపేట: పేదలు, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని కేశవపల్లిలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలు గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని అది వారి భవిష్యత్తుకు బలమైన పునాది అన్నారు. ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందుకు మీ అందరి ఆశీర్వాదం, సహకారం ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతా సింగ్ నాయక్, సర్పంచ్ పావని, పార్టీ నాయకులు రామ్‌రెడ్డి, నాగిరెడ్డి, దేవయ్య, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు అన్ని గామ్రాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. షాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న పశువులకు ఆయా మండలాల్లో ఉన్న పశువైద్యాధికారుల బృందం టీమ్‌లుగా ఏర్పడి టీకాలు వేయనున్నట్లు చెప్పారు.


