అనంతగిరి: హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మహిళల్లో గర్భకోస క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో కౌమార దశలోని బాలికలకు వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు వివరించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా వాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఉమాశంకర ప్రసాద్, రాజేశ్వరి, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
బాలికల ఆశ్రమ పాఠశాలలో..
బొంరాస్‌పేట: కౌమార దశలోని బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న హెచ్‌పీవీ పట్ల అపోహలొద్దని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీంద్రయాదవ్ అన్నారు. సోమవారం మండలంలోని బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్‌పీవీ పరీక్షలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భస్త ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టేందుకు ఈ వ్యాక్సినేషన్ ముందస్తు జాగ్రత్తగా పనిచేస్తుందన్నారు. దీనిపట్ల తల్లిదండ్రులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. 200మంది విద్యార్థినులకు వ్యాక్సినేషన్ చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ హేమంత్‌కుమార్, ప్రిన్సిపాల్ విక్రమ్‌సింగ్, వార్డన్ రాజన్న, ఉపాధ్యాయులు, నాయకులు నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దీపక్ తివారి
వాల్ పోస్టర్ ఆవిష్కరణ


