అనంతగిరి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయమూర్తి చంద్రకిశోర్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వికారాబాద్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు ఉన్నత చదువులు చదవాలన్నారు. ప్రభుత్వ అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్నారు. అందుకు చదువు ఒక్కటే మార్గమన్నారు. నేటి సమాజంలో మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణలర్పించిన వీరవణితలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బస్వరాజు పటేల్, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శంకరయ్య, జాయింట్ సెక్రటరీ ఆనంద్, సీనియర్ న్యాయవాదులు కమాల్‌రెడ్డి, నాగరాజు, యాదవరెడ్డి, శంకరయ్య, అశోక్‌కుమార్, నాగరాజు, నారాయణ, మాధవరెడ్డి, శుభప్రద్ పటేల్, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి చంద్రకిశోర్


