రూ.12 వేల కోట్లతో రహదారుల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

రూ.12 వేల కోట్లతో రహదారుల నిర్మాణం

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

బషీరాబాద్‌: రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల బడ్జెట్‌తో 7వేల కిలోమీటర్ల మేర చేపట్టిన రాష్ట్ర రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ మోహన్‌నాయక్‌ తెలిపారు. తెలంగాణలోని 180 జిల్లా రోడ్లను రాష్ట్ర రహదారులుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, బషీరాబాద్‌ ప్రాంతాల్లో రూ.300 కోట్లతో నిర్మిస్తున్న రహదారులను సోమవారం పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా బషీరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ జెడ్పీ రోడ్లను 3.5 మీటర్ల నుంచి 7 మీటర్లకు, మండల రోడ్లను 7నుంచి 10 మీటర్లకు, పట్టణాల్లో రహదారులను 10 నుంచి 14 మీటర్ల వెడల్పుతో విస్తరిస్తున్నామని తెలిపారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్‌ జిల్లాలోని రోడ్లన్నీ వేగంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. కల్వర్టుల నిర్మాణం కారణంగా పలుచోట్ల కొంత ఆలస్యమవుతోందని తెలిపారు. సీఎం ఆదేశాలతో పెండింగ్‌ బిల్లులు సైతం సర్దుబాటు చేసి, కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నామన్నారు. తాండూరు నుంచి అనంతగిరి హిల్స్‌లోని నంది ఘాట్‌ వరకు రూ.101 కోట్లతో 30కి.మీ. మేర రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు రూ.300 కోట్లతో జరుగుతున్న వికారాబాద్‌ – తాండూరు, మహబూబ్‌నగర్‌ – చించోళ్లి (టౌన్‌ పోర్షన్‌), అగ్గనూర్‌ – బషీరాబాద్‌, బషీరాబాద్‌ – మైల్వార్‌, – కరణ్‌కోట, గౌతాపూర్‌ – కరణ్‌కోట రోడ్ల పురోగతిని పరిశీలించారు. తాండూరు బైపాస రోడ్డు భూ సేకరణకు ఇంకా రూ.25 కోట్లు అవసరం ఉందన్నారు. భూ కరణ పూర్తయిన వెంటనే పనులు వేగవంతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌నాయక్‌, ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ శ్రావణ్‌కుమార్‌, ఏఈ రిషివరుణ్‌, కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్టేట్‌ హైవేలుగా 180 జిల్లా రోడ్లు

రెండున్నరేళ్లలో పనులు పూర్తి చేస్తాం

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ మోహన్‌నాయక్‌

జిల్లాలోని పలు రహదారుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement