అనంతగిరి: పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పా టిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రజాపాలన – ప్ర గతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోజువారి కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శి శిల్పను అడి గి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రా యాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, ఎంపీఓ దయానంద్, సర్పంచ్ స్వేత శివ య్య, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సిద్దులూర్‌ను సందర్శించిన జెడ్పీ సీఈఓ
మండలంలోని సిద్దులూర్ గ్రామామంలో జెడ్పీ సీఈఓ సుధీర్ పర్యటించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశీలించారు. పిల్లలు, గర్భిణుల హాజరు శాతం తెలుసుకొన్నిరు. కార్యక్రమంలో ఎంపీడీఓ వినయ్‌కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్


