నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి

Mar 14 2026 10:26 AM | Updated on Mar 14 2026 10:26 AM

ఎస్పీ స్నేహమెహ్ర

అనంతగిరి: పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్‌ కార్యాలయ సమావేశ మందిరంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీడీఆర్‌, ఐపీడీఆర్‌ల విశ్లేషణ, విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, సీసీఎస్‌సీఐ బల్వంత్‌ రాయ్‌, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement