బషీరాబాద్: మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలను శుక్రవారం బషీరాబాద్ సర్పంచ్ వెంకటేశ్ మహరాజ్, ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భోజనం గురించి ఫిర్యాదులు వచ్చాయని ఎస్‌ఓకు తెలిపారు. వంట గదిని తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి భోజనం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అన్నం మాడిపోవడంపై అక్కడి సిబ్బందిని వివరాలు అడిగారు. ఇలా ఉంటే పిల్లలు ఎలా తింటారని ప్రశ్నించారు. తాజా కూరగాయలు వండి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా విజిటర్ డైరీలో కంప్లైంట్ రాశారు. మరోసారి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు నరేష్ చౌహన్, కాంగ్రెస్ నాయకులు పవన్ ఠాకూర్, సాయిలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


