మోమిన్‌పేట: పురుగు మందు తాగిన ఓ వ్యక్తిని 108 సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన శుక్రవారం మోమిన్‌పేటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి దేవరంపల్లి గ్రామానికి చెందిన చాకలి ఎల్లయ్య.. అప్పుల పాలయ్యాడు. ఆ రుణం తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురై.. పరుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది.. సీపీఆర్ చేశారు. అనంతరం మెరుగైన కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఈఎంటి తరుణ్, పైలట్ తాజొద్దీన్‌లను కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.
ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది


