● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
● ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 5కే రన్
తాండూరు టౌన్: అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమనే ఉద్దేశంతో ఆరోగ్య తాండూరు, అభివృద్ధి తాండూరు అనే నినాదంతో ముందుకెళ్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 5 కే రన్‌లో ఆయన పాల్గొన్నారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి విలియంమూన్ చౌరస్తా వరకు 5కే రన్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ముందడుగు వేస్తోందన్నారు. ప్రతి రోజూ ప్రజలను, అధికారులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో 99 రోజుల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు, క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు 5 కే రన్ ఏర్పాటు చేసిందన్నారు. అభివృద్ధితో పాటు ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యమన్నారు. కలిసి కట్టుగా తాండూరును క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా మార్చేద్దామన్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మఽధుసూదన్ రెడ్డి, ఎమ్మార్వో తారాసింగ్, కౌన్సిలర్లు, సహారా క్రికెట్ అకాడమీ క్రీడాకారులు, వాకర్స్ టీం సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
డబ్బు అడిగితే ఫోన్ చేయండి
యాలాల: సంక్షేమ పథకాలకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తనకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. పథకాల మంజూరులో మధ్యవర్తుల జోక్యాన్ని సహించేది లేదన్నారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ.61.07 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కానుకలు అందజేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సింలు, సొసైటీ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షులు అక్బర్‌బాబా, బీమప్ప, సర్పంచ్‌లు అమర్‌నాథ్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నాయకులు పేరి రాజేందర్‌రెడ్డి, అమృతయ్య, మధుసూదన్‌రెడ్డి, పవన్‌కుమార్, హన్మంతు, మహిపాల్, ఖాసీం, ఉప సర్పంచ్‌లు కై లా రాఘవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహేష్, నరేష్ తదితరులు ఉన్నారు.


