చేవెళ్ల: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని సోలిపేటలో రూ.40 లక్షలతో సీసీరోడ్డు, హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో రూ.20 లక్షల నిధులతో సీసీరోడ్లకు శంకుస్థాపన, సోలిపేటలో ఇందిరమ్మ ఇళ్లు, చందనవెళ్లిలో చలివేంద్రంను ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభు త్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గ్రామాల్లో ఎ లాంటి సమస్యలు ఉన్న వాటిని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, సర్పంచులు రాజేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నవనీతస్వామి, శాంతమ్మయాదయ్య, స్వరూప మహేందర్‌గౌడ్, రాజునాయక్ పాల్గొన్నారు.


