జిల్లా నోడల్ ఆఫీసర్ విశాల్ రాజ్
అనంతగిరి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ శాఖ అసిస్టెంట్ డైరక్టర్, జిల్లా నోడల్ ఆఫీసర్ విశాల్ రాజ్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ – వెస్ట్ సేకరణను పరిశీలించారు. అక్కడి నుంచి రాజీవ్ గృహకల్పకు చేరుకొని మహిళా సంఘం సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అక్కడి నుంచి డంప్ యార్డు, కుక్కల జనన నియంత్రణ కేంద్రం, నగర వాటిక, శివసాగర్ చెరువును పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, డీఈ రాకేష్‌రెడ్డి, మెప్మా ఇన్‌చార్జ్ వెంకటేశ్, శానిటరీ ఇన్‌చార్జ్ ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.


