మరో యువకుడికి తీవ్ర గాయాలు
చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నవాబుపేట మండలం ఎత్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన పామేన వెంకటేశ్, మనీలా దంపతులు. వారి కుమారుడు వినీల్(19) చిన్నపప్పటి నుంచి చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి లోని అమ్మమ్మ ఇంట్లో మేనమామ కరికె సత్యనారాయణ వద్ద ఉంటున్నాడు. నగరంలో మోకానిక్‌గా పనిచేస్తున్నాడు. శనివారం దేవునిఎర్రవల్లి నుంచి స్నేహితుడు అభిలాష్‌తో కలిసి బైక్‌పై వస్తున్నాడు. మండలంలోని పామెన గేట్ వద్దకు రాగానే ఓ కారు రివర్స్ తీసుకుంటుండగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి కింద పడిపోయారు. వినీల్ అక్కడిక్కడే మృతి చెందగా అభిలాష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు, ఇతర స్నేహితులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి వినీల్ అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన అభిలాష్‌ను మెరుగైన చికిత్సకోసం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


