అనంతగిరి: గ్రామాలకు న్యాయసేవలు విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ న్యాయసేవ అధికార సంస్థ రెండు మొబైల్ వ్యాన్లను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్,తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోసి ప్రారంభించారని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరి వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మొబైల్ వ్యాన్లు ఇక నుంచి గ్రామాలకు వెళ్లి, ప్రజలకు చట్టాలపై అవగాహన, న్యాయసేవాధికారాసంస్థ ఎలా పనిచేస్తుంది తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.


