బొంరాస్‌పేట/యాలాల: ముస్లింల పవిత్రమైన రంజాన్ పండుగకు ప్రభుత్వం అధికారికంగా ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ వసీం డిమాండ్ చేశారు. శనివారం ఆయన బొంరాస్‌పేట, యాలాలలో విలేకరులతో మాట్లాడారు. ముస్లింలు నెలరోజులపాటు ఎంతో నిష్టగా, పవిత్రంగా పండుగ జరుపుకొంటారని ఐదు రోజుల పాటు ప్రత్యేక సెలవులు ఇవ్వాలన్నారు. మైనార్టీల మనోభావాలను గౌరవించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.


