మర్పల్లి: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎన్‌ఆర్‌జీఎస్ రూ.10 లక్షల నిధులతో సర్పంచ్ రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవీందర్, సీనియర్ నాయకులు సుభాష్‌యాదవ్‌తో కలిసి సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శేఖర్‌యాదవ్, మండల నాయకులునగేష్, నర్సింహులు యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగదీశ్, పట్లూర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మహేశ్, సర్వేశ్, దివాకర్, అనంత్‌రెడ్డి, రంగయ్య, గౌస్ తదితరులు ఉన్నారు.


