కుల్కచర్ల: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన చీమ పూజ శ్రీనివాస్ ఆరోగ్య సమస్యలతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా.. రూ.1.20 లక్షల చెక్కు మంజూరు అయింది. ఈ మేరకు శనివారం ఆయన బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఇందులో మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, ఏఎంసీ డైరెక్టర్ రాంచంద్రయ్య, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, నాయకులు రాంరెడ్డి, కృష్ణయ్య, నర్సింహులు, రాములు తదితరులు పాల్గొన్నారు.


