మోమిన్‌పేట: వంట గ్యాస్ లీక్ అయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ వైదేహి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బూర్గుపల్లి వద్ద ఉన్న మేఘా గ్యాస్ పంపిణీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎక్కడ గ్యాస్ లీక్ అయిన వెంటనే పంపిణీ కేంద్రానికి సమాచారం అందుతుందన్నారు. వినియోగదారులు సైతం వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సేీఫ్టీ అథారిటీ టీం సభ్యులు వెంటనే మరమ్మతు చేస్తారని వివరించారు. సేఫ్టీ అథారిటీ టీం సభ్యులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మేఘా గ్యాస్ పంపిణీ పైపుల ద్వారా అవసరమైన వారికి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారన్నారు. రెగ్యులేటరు, ఆన్‌ఆఫ్ సిస్టం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ నితిన్‌కుమార్, జిల్లా ఫైర్ అధికారి పూర్ణచంద్ర, స్టేషన్ ఫైర్ అధికారి వికారాబాద్ ధనుంజయ స్వామి, సీఐ వెంకట్, ఎస్‌ఐలు, మేఘా గ్యాస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ వైదేహి


