నేడు శిక్షణ కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

నేడు శిక్షణ కార్యక్రమం

Mar 12 2026 9:12 AM | Updated on Mar 12 2026 9:12 AM

నేడు శిక్షణ కార్యక్రమం ఘనంగా తుల్జాభవాని పండుగ

అనంతగిరి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై గురువారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దీపక్‌ తివారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌లోని గౌలికార్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

దుద్యాల్‌: మండలంలోని సంట్రకుంట తండాలో తుల్జాభవాని పండుగను బుధవారం రాత్రి ఘనంగా జరుపుకొన్నారు. ఇళ్ల ముందు ధాన్యం బస్తాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సంట్రకుంట తండా, ఈర్లపల్లి గ్రామాల సర్పంచులు మాణిక్య నాయక్‌, మొగులప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement