హయత్‌నగర్: మునుగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రారంభించనున్నట్టు రిజిస్ట్రార్ విజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మునుగనూరులోని పాత పంచాయతీ భవనంలోకి మార్చాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ప్రభు త్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్యాలయాన్ని మునుగనూరుకు మార్చినట్లు తెలిపారు.


