ధారూరు: రహదారి పక్కనున్న చెట్లను నరికేసిన ఘటన సోమవారం వెలుగుజూసింది. ధారూరు ఫారెస్ట్ రేంజ్ రుద్రారం సెక్షన్ కోట్‌పల్లి ప్రధాన రోడ్డు పక్కనున్న భారీ వృక్షాలను కొట్టివేయడంతో స్థానికుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమయింది. వివరాలు.. విద్యుత్ తీగలకు తగులుతున్న కొమ్మలను నరికివేస్తామని విద్యుత్ సిబ్బంది ఫారెస్టు అధికారి, గ్రామ పంచాయతీ దృష్టికి తెచ్చింది. దీంతో కొమ్మల్ని మాత్రమే తొలగించాలని సూచించారు. ఓ అటవీ శాఖ అధికారి సహకారంతో విద్యుత్ సిబ్బంది పేరిట కట్టెల వ్యాపార రోడ్ల పక్కనున్న భారీ వృక్షాలను మిషన్ల సహకారంతో నేల మట్టం చేసి లారీల్లో కలప తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఫారెస్ట్ అధికారి జ్ఞానేశ్వర్, ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌ఓ శ్యాంకుమార్ ఎన్ని చెట్లు నరికారు? వృక్ష పరిమాణం, ఎక్కడ నుంచి ఎక్కడ కొట్టివేశారు అనే పూర్తి సమాచారం ఇవ్వాలని సంబంధిత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌ను ఆదేశించారు. ఈ విషయం తెలంగాణ ఫారెస్టు చీఫ్ కన్జర్వేటర్ దృష్టికి వెళ్లడంతో అధికారుల్లో దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి.


