సాంకేతికతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతో అధిక దిగుబడులు

Mar 12 2026 9:12 AM | Updated on Mar 12 2026 9:12 AM

కొడంగల్‌ రూరల్‌: వవ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి టీ రాజరత్నం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టీ రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పర్సాపూర్‌ రైతు వేదికలో డివిజన్‌ ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో బీఎఫ్‌ఏసీ, ఆర్‌పీఎల్‌ నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు సలహాలు అందించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు, యాంత్రీకరణలో నవీన మార్పులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నానో యూరియా, డీఏపీ వినియోగంపై సలహాలు ఇచ్చారు. వరి పంటలో కొత్త వంగడాలు, సమగ్ర సస్యరక్షణ చర్యలు, ప్రకృతి వ్యవసాయం, నూనె గింజల పంటల సాగు గురించి తెలియజేశారు. వ్యవసాయ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. డ్రోన్‌ పనితీరును డెమో ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ కె.శంకర్‌ రాథోడ్‌, మండల వ్యవసాయాధికారులు ఎన్‌.శ్రీలత, ఎన్‌.పొలప్ప, ఆత్మ స్టాఫ్‌ బీటీఎం కె.బాలకృష్ణ, ఏటీఎం ఎ.వినోద్‌, నానో యూరియా, డీఏపీ, కోరమండల్‌, స్పిక్‌ ప్రతినిధులు ప్రసాద్‌, శ్రీకాంత్‌, చంద్రం, హుస్సేన్‌, డ్రోన్‌ ప్రతినిధులు హేమంత్‌రాజు, రైతులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, శాస్త్రవేత్త రాజేశ్వర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement