● ఫిర్యాదుదారుడినిచితకబాదిన హెడ్ కానిస్టేబుల్
● మీడియా ఎదుటగోడు వెల్లబోసుకున్న బాధితుడు
బషీరాబాద్: అధికార పార్టీ సర్పంచ్‌పైనే ఫిర్యాదు చేస్తావా..? అంటూ ఓ హెచ్ కానిస్టేబుల్ తనపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బోజ్యానాయక్‌తండాకు చెందిన సేవ్యానాయక్ కూలీ పనులు చేస్తూ జీవనంసాగిస్తున్నాడు. ఈ నెల 3న గ్రామంలో జరిగిన ఓ గొడవలో తన ప్రమేయం లేకపోయినా సర్పంచ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశావంటూ ఆమె వర్గీయులు సేవ్యానాయక్‌ను దూషించారు. ఈవిషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు మరుసటి రోజైన 4న బీషీరాబాద్ పీఎస్‌కు వెళ్లి, సర్పంచ్ శాంతిభాయి, ఆమె భర్తపై ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా తాగిన మైకంలో తన భర్తను చంపేస్తానంటూ వాగుతున్నాడని సర్పంచ్ శాంతి కూడా ఫిర్యాదు చేశారు. పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లోక్యానాయక్ ఫిర్యాదుదారుడైన సేవ్యానాయక్‌ను తీసుకెళ్లి చేతులు బొబ్బలు వచ్చేలా, వేల్ల నుంచి రక్తం కారేలా కొట్టాడు. ఈ విషయాన్ని బయట చెబితే ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు ఓ లాయర్‌ను కలిసి, ఆయన ద్వారా విషయాన్ని సీఐ, డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. సదరు కానిస్టేబుల్ గతంలో కూడా తండాకు చెందిన రవి అనే యువకుడిని తీసుకెళ్లి దాడి చేశాడని స్థానికులు తెలిపారు. ఈ విషయమై హెడ్‌కానిస్టేబుల్ లోక్యానాయక్‌ను అడగగా.. ‘రాజకీయ నాయకులు, పోలీసులను దూషిస్తున్నాడని పీఎస్‌కు తీసుకువచ్చాం. ఎస్‌ఐ నుమాన్‌అలీ ఆదేశాల మేరకు బెల్టుతో రెండు, మూడు దెబ్బలు కొట్టిన మాట వాస్తవమే. రాజకీయ నాయకులను, పోలీసులను దూషిస్తే కొట్టొద్దా..? శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు గట్టిగా మందలించిన మాట వాస్తవమే’ అని తెలిపారు.


