పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

Mar 14 2026 10:26 AM | Updated on Mar 14 2026 10:26 AM

ఎస్పీ స్నేహమెహ్ర

అనంతగిరి: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ స్నేహమెహ్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని, ఇంటర్నెట్‌ సెంటర్లు, జిరాక్స్‌ షాపులు మూసివేయాలని ఆదేశించారు.

వ్యక్తిపై కేసు నమోదు

కుల్కచర్ల: సోదరిపై దాడి చేసిన సోదరుడిపై కేసు నమోదు అయింది. ఈ సంఘటనమండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. పాత్ల వత్‌ శంకర్‌.. జేసీబీ విషయంలో సోదరి ఉమ తో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను శంకర్‌ తోసివేయగా.. గాయపడింది. దీంతో బాధితురాలు భర్త గోపాల్‌ ఫిర్యాదు మేరకు.. శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

తాండూరు రూరల్‌: కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చెంగోల్‌ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాథోడ్‌ వినోద్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైండ్ల లక్ష్మి(52), వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. కొన్ని నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఇంట్లో దూలానికి తాడుతో ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కేసు దర్యాప్తులో ఉంది.

సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.లక్ష అందజేత

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 22వ వార్డు కౌన్సిలర్‌ లంకా లక్ష్మికాంత్‌రెడ్డి రూ.లక్ష అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న సంస్కరణల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎంతో దోహదపడుతుందన్నారు. తన వంతుగా రూ.లక్ష అందజేసినట్లు తెలిపారు. సీఐ రఘుకుమార్‌ లక్ష్మికాంత్‌రెడ్డిని అభినందించారు.

జాతీయ సెమినార్‌లో

షాద్‌నగర్‌ ప్రొఫెసర్‌

షాద్‌నగర్‌: తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వారి ఆధ్వర్యంలో గ్రీన్‌ ఎనర్జీ రీసోర్సెస్‌ క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇన్‌ ఇండియా పేరుతో నల్లగొండలో శుక్రవారం జాతీయ సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌కు షాద్‌నగర్‌కు చెందిన అర్ధశాస్త్ర అధ్యాపకుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పర్యావరణ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం’ అంశంపై చేసిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ సదస్సుకు దేశంలోని విఽవిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల ప్రొఫెసర్లు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement