ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని కౌన్సిలర్ ఆంజనేయులుయాదవ్ కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని విద్యాశాఖ కార్యాలయంలో గురువారం ఈ మేరకు ఆయన వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్‌ను రద్దు చేసి పాఠశాలలోనే విధులు నిర్వహించేలా చూడాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు.
108 అంబులెన్స్‌లో ప్రసవం
అబ్దుల్లాపూర్‌మెట్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ అంబులెన్స్‌లో ప్రసవించిన సంఘటన గురువారం ఉదయం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుంతపల్లి గ్రామానికి చెందిన లావణ్యకు పురిటి నొప్పుల రావడంతో 108 వాహనానికి కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 వాహన మెడికల్ టెక్నిషీయన్ దశరథ, పైలట్ చెరుకు శ్రీనివాస్ సాధారణ ప్రసవం చేశారు. ఫలితంగా లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో హయత్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తల్లీశిశువును తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా లావణ్య కుంటుబీకులు అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలయజేశారు.
బాధ్యతల స్వీకరణ
శంకర్‌పల్లి: స్థానిక పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా గురువారం మీర్ ముదస్సర్ అలీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన వెయింటింగ్ లిస్ట్‌లో ఉండగా.. తాజాగా ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు శంకర్‌పల్లి ఠాణా ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇక్కడ పని చేస్తున్న శ్రీనివాస్ గౌడ్‌ని కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్స్ విభాగానికి బదిలీ చేశారు. ఠాణాలో శాంతి భద్రతలను కాపాడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని, అదే విధంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు విసృత్తంగా అవగాహన కల్పించనున్నట్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ముదస్సర్ అలీ పేర్కొన్నారు.
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్టు మండలం మునుగనూరులోని సర్వే నంబర్ 83లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుండడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు గురువారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని అక్రమంగా దున్నుతూ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో బోర్డు తొలగించి ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసు కేసు కూడా నమోదైందని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేది లేదని, బోర్డును తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
షాద్‌నగర్: కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామ పరిధిలో ఉన్న జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌ను కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయానికి వెళ్లి ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సుమారు రూ.12 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, మరో రూ.8 కోట్లు మంజూరు చేయాలన్నారు. స్పందించిన మంత్రి దర్గాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టిందని, అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.


