హామీలు విస్మరించిన ముఖ్యమంత్రి | - | Sakshi
Sakshi News home page

హామీలు విస్మరించిన ముఖ్యమంత్రి

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

కేజీబీవీలో ఉపాధ్యాయుల నిరసన

దోమ: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. సోమవారం మండల పరిధి కస్తుర్బాగాంధీ పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరంగల్‌ సభలో ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని ఆరోపించారు. ఉద్యోగులందరికీ ప్రభుత్వం కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజ్‌ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. సమ్మె కాలపు వేతనాలను విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఈ నెల 20న అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్‌ఓ శైలజ, సీఆర్‌పీలు రెడ్యానాయక్‌, రఘుసింగ్‌, వెంకటేశ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నజీర్‌, పీటీఏలు యాదగిరి, జంగయ్య, సత్యనారాయణ, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement