అనంతగిరి: జిల్లాలోని షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలకు షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రూ.లక్ష వరకు ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు(90శాతం సబ్సిడీ), రూ.3లక్షలు విలువ గల త్రిచక్ర ఎలక్ట్రికల్ ఆటో ప్యాసింజర్ లేదా గూడ్స్ వాహనాలు(70శాతం సబ్సిడీ), రూ.3లక్షల నుంచి 7లక్షల వరకు(60శాతం సబ్సిడీ) విలువ గల సోలార్ యూనివర్సిల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ భాగాల యూనిట్లను లోన్ల కింద ప్రకటించారన్నారు. అభ్యర్థి సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హత కలిగిన వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నమోదు ప్రక్రియ ఈనెల 17 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గల రెండో అంతస్తులోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
కలెక్టర్ దీపక్ తివారి


