చదువుతో పాటు ఆటల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతో పాటు ఆటల్లో రాణించాలి

Mar 15 2026 6:48 AM | Updated on Mar 15 2026 6:48 AM

అనంతగిరి: విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని వికారాబాద్‌ టౌన్‌ సీఐ రఘుకుమార్‌ అన్నారు. శనివారం వికారాబాద్‌ పట్టణంలోని వింటేజ్‌ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని బసంత్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేయగా.. సీఐ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కృషి పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా.. వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు బహమతులు అందజేశారు. చిన్నారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ బాబుసింగ్‌, స్కూల్‌ డైరెక్టర్‌ అనితా, కరస్పాండెంట్‌ శ్రీధర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement