జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్
అనంతగిరి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి జనగణన పకడ్బందీగా చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌ఓ) మంగీలాల్ సూచించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనాభా లెక్కలకు సంబంధించి అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ సుధీర్ హాజరై జ్యోతి ప్రజల్వన చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మంగీలాల్ మాట్లాడుతూ.. మొదటి దశలో హౌస్ లిస్టింగ్(ఇండ్ల జాబితా)ను మే 11 నుంచి జూన్ 9 వరకు, రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుందన్నారు. 2027 మార్చి 1వ తేదీని రిఫరెన్స్‌గా పరిగణిస్తామన్నారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనకు జనాభా గణాంకాలు కీలకంగా ఉంటాయన్నారు. మొదటిసారిగా డిజిటల్ విధానం ద్వారా మొబైల్ యాప్, వెబ్ పోర్టల్‌ను ఉపయోగించి ఈ గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారన్నారు. ఇందులో జనాభా లెక్కల అధికారులు శ్రీకాంత్‌నాయక్, వంగ పండు గీత పీపీటీ ద్వారా శిక్షణ నిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, తాండూరు ఆర్డీఓ అనిత, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్‌కుమార్‌ను ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఆదివారం కమిటీ సభ్యులు నందారం ప్రశాంత్‌కుమార్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఆర్యవైశ సంఘం సభ్యులు రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
వడివడిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
వేగం పెంచిన అధికారులు
ఆర్థిక చేయూతకు రంగం సిద్ధం
99 రోజుల ప్రణాళికలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు..


