గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

నవాబుపేట: గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచులు కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలో ఐటీశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌ బాబును కలిసి విన్న వించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి, కలెక్టర్‌కు సూచించారని తెలిపారు. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల ఇన్‌చార్జి బీమ్‌భరత్‌, మండల అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచులు నరసింహా రెడ్డి, నర్సింహులు, మల్లేశం, ప్రభాకర్‌, నాయకులు దశరథ్‌, అనంత రాములు, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి, ఉపేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, అమీర్‌ ఖాన్‌, మిరాజ్‌, పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కట్టడాల కూల్చివేత

కొడంగల్‌: కొడంగల్‌ మున్సిపల్‌ పరిధిలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను సోమవారం అధికారులు కూల్చి వేయించారు. పట్టణ శివారులో కోస్గి రోడ్డు పక్కన పర్మిషన్‌ లేకుండా నిర్మించిన కాంపౌండ్‌ వాల్‌ను జేసీబీ సాయంతో కూల్చి వేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బలరాం నాయక్‌ తెలిపారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతే కట్టడాలు చేపట్టాలని సూచించారు.

దాడి చేసిన వారిని

అరెస్టు చేయాలి

అనంతగిరి: నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర జాతరలో దళిత కుటుంబాలపై దాడి చేసిన అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వికారాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోఽశాధికారి బుస్స చంద్రయ్య, షబ్బీర్‌, దస్తప్ప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అత్యాచార నిందితుడికి రిమాండ్‌

మోమిన్‌పేట: బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన నిందితున్ని అరెస్టు చేసి, సోమవారం రిమాండుకు తరలించామని సీఐ వెంకట్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి ఓ గ్రామానికి చెందిన బాలిక.. 7వ తరగతి చదువుతోంది. గత దిపావళి పండుగను పురస్కరించుకొని హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి ఇంటి వద్దే ఉంది. ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. బాలిక గర్భవతని నిర్ధారించారు. విషయమై ఆరా తీయగా చిన్నారి జరిగిన విషయం చెప్పింది. అనంతరం వారు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టిన పోలీసులకు మండల పరిధి సయ్యద్‌అల్లిపూర్‌ గ్రామానికి చెందిన ఉద్దాల మాణిక్యం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించి, అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

ధారూరు: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నామని ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపారు. సమాచారం మేరకు సోమవారం సిబ్బందితో కలసి మండల పరిధి కుమ్మర్‌పల్లి వాగులో ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్‌, దాని యజమాని అశోక్‌ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అక్కడే మరికొన్ని ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement