తాండూరు టౌన్: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026లో భాగంగా స్థానిక పీపుల్స్ డిగ్రీ కళాశాలలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. యాభై సంవత్సరాల అత్యవసర పరిస్థితి – భారత ప్రజాస్వామ్యం నేర్చుకున్న పాఠాలు అనే అంశంపై పోటీ నిర్వహించారు. ఓయూ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ వేంకటేశ్వర్లు, ప్రొఫెసర్ కృష్ణకుమార్, హన్మంతరావు, మహేందర్ రెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో విజేతలకు జిల్లా యువజన క్రీడాధికారి సత్తార్, ఈషయ్య బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకళ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


