ఉపాధి నిధులతో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి నిధులతో అభివృద్ధి

Mar 17 2026 8:45 AM | Updated on Mar 17 2026 8:45 AM

రూ.6.69 కోట్లు మంజూరు

గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌

మోమిన్‌పేట: మండలంలో రూ.6.69 కోట్ల ఉపాధి నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఎన్కేపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల పనులను పంచాయతీరాజ్‌ ఈఈ ఉమేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో 18 డ్వాక్రా భవనాలు, 18 వర్క్‌ షెడ్లు నిర్మించనున్నట్లు వివరించారు. అంగన్‌వాడీ భవనం, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్‌, ఉప సర్పంచ్‌ మన్నాన్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ రాజ మల్లయ్య, ఎంపీఓ యాదగిరి, పీఆర్‌ ఏఈఈ ప్రణీత్‌కుమార్‌, ఏపీఓ శంకర్‌, కార్యదర్శి తిరుపతమ్మ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అడ్విరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement