అనంతగిరి: మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి గన్‌మెన్ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వికారాబాద్ పట్టణం రామయ్యగూడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్ అలియాస్ అప్పి(40) మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న పట్నం మహేందర్‌రెడ్డి రామయ్యగూడలోని కానిస్టేబుల్ నివాసానికి చేరుకుని మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయ్‌కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకుఆనంద్ మృతుడి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.సాయంత్రం పోలీసు లాంఛనాలతో జరిగిన అంతిమ సంస్కారంలో మహేందర్‌రెడ్డి కుమారుడు రితీశ్‌రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్, ఆయా పార్టీల నాయకులు పోలీసు అధికారులు, గ్రామస్తులు నివాళి అర్పించారు.


