చెత్తగా చూడొద్దు.. సొత్తుగా వాడాలి | - | Sakshi
Sakshi News home page

చెత్తగా చూడొద్దు.. సొత్తుగా వాడాలి

Mar 9 2026 9:28 AM | Updated on Mar 9 2026 9:28 AM

బొంరాస్‌పేట: పంచాయతీల్లో సేకరించి డంపింగ్‌యార్డులలో పోగు చేస్తున్న చెత్తను ఉపయోగించుకునే ఉపాయాలెన్నో ఉన్నాయని, వాటిని సొత్తుగా వాడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ సుధీర్‌బాబు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 99రోజుల ప్రజాపాలన ప్రజా ప్రణాళికలో భాగంగా ఆదివారం ఆయన మండల సందర్శన చేశారు. మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం మండల పరిధిలోని రేగడిమైలారంలో డంపింగ్‌యార్డును పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్మికులు వాహనం ద్వారా నిత్యం సేకరిస్తున్న చెత్తపై ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచి ఎరువుగా వాడే చెత్తను వేరుచేయాలన్నారు. ప్లాస్టిక్‌ చెత్తను పోగుచేసి విక్రయించాలన్నారు. నిరుపయోగ చెత్తను కాలుష్యం లేకుండా చేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఎంపీడీఓ వెంకన్‌గౌడ్‌, ఎంపీఓ రవి, స ర్పంచ్‌ చిట్టెమ్మ, ఉపసర్పంచ్‌ దాసరి చంద్రప్ప, కాంగ్రెస్‌ నాయకులు వెంకట్‌రెడ్డి, గుండప్ప, ప్రసాద్‌గౌడ్‌, విశ్వనాథం తదితరులున్నారు.

అదనపు కలెక్టర్‌ సుధీర్‌బాబు

Advertisement
 
Advertisement
Advertisement