తండ్రీకొడుకులు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకులు అదృశ్యం

Mar 17 2026 8:46 AM | Updated on Mar 17 2026 8:46 AM

కుల్కచర్ల: తండ్రీకొడుకులు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేశ్‌ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామానికి చెందిన భీమమ్మకు ఏడేళ్ల క్రితం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్‌తో వివాహమైంది. శ్రీరా మ్‌ అత్తగారి ఇంటి దగ్గరనే ఉంటూ ఆటో నడిపించేవాడు. ఈనెల 13న శ్రీరామ్‌ శంషాబాద్‌లోని తన తల్లిని చూసి వస్తానని చిన్నకొడుకు గౌతమ్‌ను తీసుకుని వెళ్లాడు. సాయంత్రం భీమమ్మ తన అత్త చిట్టెమ్మకు ఫోన్‌ చేసిన శ్రీరామ్‌, గౌతమ్‌ వచ్చారా అని అడగ్గా రాలేదని చెప్పడంతో సాధ్యమైన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం వారు కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

నిందితులకునాలుగు రోజుల జైలు

ఎస్‌ఐ భరత్‌ భూషణ్‌

మోమిన్‌పేట: పీటీ కేసు నిందితులకు నాలు గు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ భరత్‌భూషన్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని కాస్లబాదు గ్రామానికి చెందిన సండ్ర మొగులయ్య, సండ్ర కిష్టయ్య పరస్పరం గొడవపడి ఠాణలో ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ఏన్కతల గ్రా మానికి చెందిన గోపాల్‌ తన అన్నపై ఇంటి విషయమై గొడవపడగా ఆయనపై పీటీ కేసు నమోదు చేశామన్నారు. వారిని వికారాబాద్‌ కోర్టులో హాజరుపరచగా స్పెషల్‌ జ్యుడీషియ ల్‌ మెజిస్ట్రేట్‌ రెండవ తరగతి కోర్టు న్యాయమూర్తి మాయ బ్రహ్మనర్సింహ నిందితులకు నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

దుకాణం దగ్ధం

బొంరాస్‌పేట: మండలంలోని తుంకిమెట్లలో ఆదివారం అర్ధరాత్రి ఓ దుకాణం కాలిపోయింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అంజిలయ్య కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అందులో కూల్‌డ్రింక్స్‌ తోపాటు ఫొటో స్టూడియో కూడా ఉంది. దుకాణంలో మంటలు చెలరేగడంతో స్థానికులతో కలిసి అదుపు చేశారు. అప్పటికే రూ.2 లక్షల విలువ చేసే సామగ్రి కాలిపోయిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

4న జగ్జీవన్‌రాం విగ్రహావిష్కరణ

అనంతగిరి: దోమ మండలం కిష్టాపూర్‌లో ఏప్రిల్‌ 4న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని, కార్యక్రమాన్ని జ యప్రదం చేయాలని వికారాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి కోరారు. సోమవారం అసోసియేషన్‌ కార్యాల యం ఎదుట కరపత్రం ఆవిష్కరించారు. సంయుక్త కార్యదర్శి ఆనంద్‌, లవకుమార్‌, గోవర్ధన్‌రెడ్డి, రాంచంద్రరావు, జనార్దన్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, మహేశ్‌, శుభప్రద్‌ పటేల్‌, మహేశ్‌రెడ్డి, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement