విధులు పరిపూర్ణం.. వేతనాలు అసంపూర్ణం! | - | Sakshi
Sakshi News home page

విధులు పరిపూర్ణం.. వేతనాలు అసంపూర్ణం!

Mar 11 2026 8:41 AM | Updated on Mar 11 2026 8:41 AM

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలే టార్గెట్‌గా బేసిక్‌ పే అమలుకు పోరాటం

నిరసనలకు యూటీఎఫ్‌ సంఘం ఊతం

బొంరాస్‌పేట: సమగ్రశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులుగా పనిచేస్తున్న కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై దశలవారీగా పోరాటం షురువైంది. ఈ పోరాటానికి యూటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం నేతృత్వం వహించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పార్ట్‌ టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లుగా(పీటీఐ)గా పనిచేస్తున్న ఆర్ట్‌, పీఈటీ, క్రాఫ్ట్‌ ఉద్యోగులు, అలాగే కేజీబీవీ, గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్‌ఎస్‌ఏ, ఉద్యోగుల దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ నెలసరి వేతనాల్లో ప్రభుత్వాలు అసంపూర్ణంగా ఉన్నాయంటున్నారు. జిల్లాలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు వివిధ రకాలుగా మండలాల్లో 554 మంది ఉన్నారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలే టార్గెట్‌

కనీస వేతనాల చట్టం ప్రకారం విద్యాశాఖలో పనిచేస్తున్న ఎంఐఎస్‌, సీఆర్‌పీ, పీటీఐ, ఎస్‌ఎస్‌ఏ, కేజీబీవీ ఇతర కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. వంద రోజుల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినా ప్రభుత్వం మోసం చేస్తోంది. ఉద్యోగులను రెన్యూవల్‌ చేస్తామని కాలయాపన చేస్తోందంటున్నారు. ఇది వరకు చేసిన 29రోజుల సమ్మెకాలానికి సైతం వేతనాలు చెల్లిస్తామని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పీటీఐ గా పనిచేస్తున్న ఆర్ట్‌, పీఈటీ, క్రాఫ్ట్‌, పీటీఐ, ఐఆర్‌పీ, కంప్యూటర్‌ ఆపరేటర్‌, మెసెంజర్‌, సీఆర్‌పీల వేతనాలు సరిగా పడడంలేదంటున్నారు. వివిధ కారణాలతో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బేసిక్‌ పే అమలు చేయాలని

సీఆర్పీలు, ఎంఐఎస్‌, కేజీబీవీల్లోని సీఆర్టీ, పీజీ సీఆర్టీలకు స్కూల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌చేయాలని కోరుతున్నారు. దీన్ని అమలు చేస్తే నెలసరి వేతనం రూ.47,800 ఇంక్రిమెంట్లు, హెచ్‌ఆర్‌ఏ. డీఏ., సీఎల్‌లు అమలు సీఆర్‌పీలకు టీఏలు అందుతాయని ఆశగా ఉన్నారు.

నిరసనల ప్రణాళిక

● మార్చి 9న నల్లబ్యాడ్జీలు ధరించి పాఠశాలల్లో నిరసన

● 16న డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు

● 20న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ ‘చలో అసెంబ్లీ’

ఎస్‌ఎస్‌ఏ కింద పని చేస్తున్న ఉద్యోగులు

ఉద్యోగులు వేతనం

ఎంఐఎస్‌–18 రూ.19,500

కంప్యూటర్‌ ఆపరేటర్లు–20 రూ.19,500

సీఆర్పీలు– 57 రూ.19,500

ఐఈఆర్‌పీలు–38 రూ.19,500

పీటీఐ–97 రూ.11,700

కేజీబీవీ(18)–304 రూ.26,000

(సీఆర్టీ)– రూ.29,000

(పీజీ సీఆర్టీ)

మెసెంజర్లు–20 రూ.11,050

కష్టకాలంలో కుటుంబాలు

2014 నుంచి రూ.4,500 వేతనానికే ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఇచ్చే రూ.11,700 సక్రమంగా ఇవ్వడం లేదు. ఉ ద్యోగ భద్రత లేదు. ఇచ్చిన హా మీలు నెరవేర్చాలి. కష్టకాలంలో గడుపుతున్నాం.

– వెంకటయ్య, పీటీఐ, జెడ్పీహెచ్‌ఎస్‌, రేగడిమైలారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement