మొదటి రోజు పరీక్ష ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

మొదటి రోజు పరీక్ష ప్రశాంతం

Mar 15 2026 6:47 AM | Updated on Mar 15 2026 6:47 AM

కేంద్రాలను సందర్శించిన డీఈఓ రేణుకాదేవి

వికారాబాద్‌: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శనివారం పదో తరగతి మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 13,579 మంది టెన్త్‌ విద్యార్థులు ఉండగా అందులో 6,852 మంది బాలురు, 6,691 మంది బాలికలు. 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు పరీక్షకు 48 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ రేణుకాదేవి, అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ప్రసాద్‌ వికారాబాద్‌ పట్టణంలోని పలు కేంద్రాలు సందర్శించారు. పలుచోట్ల రవాణా పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులు చెక్‌ చేసి సెంటర్లలోకి అనుమతించారు. మొదటి రోజు కావడంతో పిల్లల వెంట తల్లిదండ్రులు వచ్చారు.

రంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో పదో తరగతి మొదటి రోజు పరీక్ష సజావుగా జరిగింది. 52.851 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఉండగా 52,487 మంది పరీక్ష రాశారు. 364 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి పరీక్ష కేంద్రాలు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement