బోరు మోటార్లవిద్యుత్‌ తీగ అపహరణ | - | Sakshi
Sakshi News home page

బోరు మోటార్లవిద్యుత్‌ తీగ అపహరణ

Mar 9 2026 7:13 AM | Updated on Mar 9 2026 7:13 AM

దుద్యాల్‌: వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్ల విద్యుత్‌ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు అహరించారు. ఈ సంఘటన మండల పరిధి పోలేపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత రైతులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త ఎల్లప్ప, రెబ్బని యాదయ్య, కొత్త వెంకట్రాములు, బోయిని అంజిలయ్యలు బోరు బావుల కింద వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రైతులకు చెందిన మోటార్ల కరెంట్‌ వైరు సుమారు 100 మీటర్లు చోరీకి గురైంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సౌకర్యాల కల్పనపై

శ్రద్ధ చూపాలి

దోమ: విద్యార్థుల చదువుతో పాటు సౌకర్యాల కల్పనపై అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీసీడీఓ శ్రీదేవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ప్రత్యేకాధికారి శైలజతో కలసి పరిసరాలు, స్టోర్‌రూమ్‌, వంట గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించేలా చూడాలన్నారు.

వైద్యసేవలు అభినందనీయం

కుల్కచర్ల: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని పుట్టపహాడ్‌ సర్పంచ్‌ బోయిని అంజిలయ్య అన్నారు. శనివారం గ్రామంలో ‘ఔషధి హోమియోపతి క్లినిక్‌’ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు.. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యురాలు సాయికీర్తి, ఉప సర్పంచ్‌ శాస్త్రి, మాజీ వైస్‌ ఎంపీపీ రాజశేఖర్‌, నాయకులు హరినాథ్‌ రెడ్డి, గోపాల్‌, పాష తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిలర్లకు సన్మానం

తాండూరు: బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లను శనివారం ఆ పార్టీ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పట్లోళ్ల దీప నర్సింహులు ఘనంగా సన్మానించారు. ఈ నెల 9న జరిగే కౌన్సిల్‌ సమావేశం నేపథ్యంలో కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింహులు, గద్దే శ్రీనివాసచారి, నరేందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement